ఫిషింగ్ హార్బర్ లో పలు సమస్యల పై అసెంబ్లీలో చర్చించిన ఎమ్మెల్యే
విశాఖ దక్షిణం,న్యూస్ వన్ ప్రతినిధి :
సముద్రంలో మత్స్య వేటకు వెళ్లి మరణించిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో చెక్కును దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీ పాలెం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. నియోజకవర్గ పరిధిలో లో చెంగలరావు పేట కు చెందిన సురాడ తమ్మయ్య ,కోడి పంద్యాల వీధికి చెందిన బెవర పోలరాజు మారుపల్లి అప్పన్న గారికి ఒక్కరికి 5 లక్షలు చొప్పున అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు .అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు తమకున్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జేడీ ఫిషరీస్ లక్ష్మణరావు , బోటు అసోసియేషన్ పెద్దలు లక్ష్మణరావు , కూటమి 37 వార్డు అధ్యక్షులు రవి , వార్డు కూటమి ఇంచార్జి భాను , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!