సినిమా
8 వార్తలు కనుగొనబడ్డాయి
సినిమా
జాన్వీ కంటే శ్రీలీలకె ఎక్కవ..!
( వన్ సినిమా )భారతీయ సినీ పరిశ్రమలో భిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలు అలాగే రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సినీ వర్గాలలో హల్చల్ అవుతోంది. జాన్వికపూర్, శ్రీలీల ఒకే హిందీ సినిమాలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. 'కృష్ణావతారం పార్ట్ 1 ది హార్ట్' మూవీ ఫేమ్ సిద్ధార్థ్ గుప్తా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి రొమాంటిక్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఉమేష్ బిస్ట్ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడటం అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరిగినట్లు తెలిపారు. నటీనటుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. వైవిధ్యమైన లవ్ స్టోరీతో పాటు థ్రిల్ కలిగించే అంశాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.సినిమాల పరంగా నటిస్తున్న తారలందరూ వరుస ప్రాజెక్ట్‌లతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.
‘బక్కోడు’ మామోలోడు కాదంట !
( వన్ సినిమా )తమిళంతో పాటు ఇటు టాలీవుడ్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు. ఇటీవలే వచ్చిన ‘జైలర్ 2’ గ్రాండ్ సక్సెస్‌తో పాటు సన్ నెట్వర్క్ వారసురాలు, ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్‌తో ఆయన పెళ్లి ఖరారు కావడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఆయనతో ముడిపడి ఉన్న హీరోయిన్ల డేటింగ్ రూమర్లు, పాత లవ్‌స్టోరీలు మళ్లీ నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.అనిరుధ్ పేరు ప్రస్తుతం ఇండియా మొత్తం మార్మోగిపోతోంది. ఒకవైపు ‘జైలర్ 2’ సినిమాలో ఆయన అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఊపేస్తుంటే, మరోవైపు పెళ్లి వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కావ్య మారన్, అనిరుధ్ల వివాహం వచ్చే నెలలో గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనుండగా, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ దంపతులు స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను ఇన్వైట్ చేస్తుండటంతో ఈ వార్త అధికారికంగా నిరూపితమైంది.కళానిధి మారన్ ఆస్తుల విలువ దాదాపు రూ.26 వేల కోట్లు కాగా, ఆ భారీ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు కావ్య మారన్. ఆమెనే అనిరుధ్ పెళ్లి చేసుకోబోతుండటంతో మన ‘బక్కోడు’ ఒక్కసారిగా వేల కోట్లకు అధిపతి అయ్యాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక వినోద, వ్యాపార రంగాలకు చెందిన ఈ బిగ్గెస్ట్ కపుల్ కాంబినేషన్ చూసి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.అనిరుధ్ లవ్ లైఫ్ గురించి మాట్లాడితే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నటి, సింగర్ ఆండ్రియా. తనకంటే ఆరేళ్లు పెద్దదైన ఆండ్రియాతో అనిరుధ్ దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ ముద్దులు పెట్టుకున్న ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అవ్వడం అప్పట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ లీకేజ్ వివాదం జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు.ఆండ్రియాతో బ్రేకప్ తర్వాత అనిరుధ్ పేరు పలువురు హీరోయిన్లతో వినిపించింది. ‘3’ సినిమా టైమ్‌లో శ్రుతిహాసన్‌తో, అలాగే ప్రియా ఆనంద్‌తో రిలేషన్షిప్లో ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే ప్రియా ఆనంద్ తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇక మహానటి కీర్తి సురేష్, పాపులర్ సింగర్ జోనితా గాంధీలతో కూడా అనిరుధ్ డేటింగ్ చేశారనే ప్రచారం జరిగింది. కానీ కీర్తి సురేష్ అవన్నీ అబద్ధాలని చెప్పి, తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని ఆ రూమర్లకు చెక్ పెట్టారు. ఇక మొత్తానికి చూస్తే, ఎన్నో లవ్ రూమర్లు, డేటింగ్ వివాదాల తర్వాత అనిరుధ్ రవిచందర్ లైఫ్ ఇప్పుడు కావ్య మారన్‌తో పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఒకవైపు సౌత్ ఇండియాలో అగ్ర సంగీత దర్శకుడిగా తనకంటూ తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అనిరుధ్, కావ్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండటంపై ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తట్టుకోలేక సినిమాలు మానేద్దాం అనుకున్న (Anupama Parameswaran)
( వన్ సినిమా )ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఒకానొక దశలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ఇండస్ట్రీ వేధింపులు తట్టుకోలేక సినిమాలు వదిలేద్దామని కూడా అనుకుందట. అయితే గుండె ధైర్యం చేసుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు మళ్ళీ ఈ స్థాయికి వచ్చాను అంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.భద్రప్ప గాజుల దర్శకత్వంలో వీకే నరేష్ తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్ లీడ్‌రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రేజీ కల్యాణం. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అనుపమ.. తన వ్యక్తిగత జీవితంపై, ఇండస్ట్రీ తీరుపై, భార్యాభర్తల బంధంపై ఇలా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.క్రేజీ కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ మాట్లాడుతూ..”గతంలో వేధింపుల వల్ల ఎంతగానో కృంగిపోయానని, ఒక దశలో సినిమాలే మానేద్దామని అనుకున్నట్లు అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. అద్దంలో చూసుకుంటే నేనేనా అనిపించేది .రోజు గడిచేసరికి ఈరోజు బతికిపోయాను దేవుడా అనుకునేదాన్ని. అయినా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డాను. అంటూ అనుపమ చేసిన ఇదే ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. జీవితమే ఒక సవాలుగా మారిపోయింది. ఆ పరిస్థితిలో నటన కూడా మానేద్దాం అనుకున్నాను. కానీ ధైర్యంగా ముందుకు నడిచాను. నిజానికి ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడినప్పుడు విమర్శలు వస్తాయని భావించాను. కానీ చాలామంది నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. నా అనుభవాలు కొందరిలో అయినా ధైర్యం నింపుతాయనుకుంటే నేను ఎన్ని విమర్శలకైనా సిద్ధమే అంటూ అనుపమ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అలాగే డబ్బుల కోసం నటించడంపై కూడా ఈమె స్పందించింది. నేనెప్పుడూ కూడా వైవిద్య భరితంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్రను చూసే ఆ సినిమా పేరు ఏంటో ప్రేక్షకులు చెప్పగలగాలి. అంత ప్రత్యేకంగా ఉండేలా నా కథల్ని, పాత్రలని ఎంచుకుంటాను. కేవలం డబ్బుల కోసమే నటించాలని అనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ముఖ్యంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు నాకు దొరికిన అనుభవం ఇప్పటికీ నా నటనలో స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎంతో సహాయపడుతోంది. అంటూ తెలిపింది.
మిల్కీ బ్యూటీ...సిల్క్ స్మిత అవుతుందా ?
వన్ సినిమా : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంచలనం సృష్టించిన బయోగ్రాఫికల్ చిత్రాలలో ది డర్టీ పిక్చర్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అగ్ర నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు కొనసాగింపుగా డర్టీ పిక్చర్ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడిన క్షణం నుంచి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనే అంశంపై సినీ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రేజీ సీక్వెల్లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో రాణిస్తున్న తమన్నాను ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆమెతో పాటు యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమిరి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని ఖరారు చేస్తారనే అంశంపై త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మొదటి భాగంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించగా, ఈ రెండో భాగంలో మాత్రం పూర్తిగా కొత్త కథతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. గత చిత్రానికి మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది. నటీనటుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.సినిమాల పరంగా తమన్నా వరుస ప్రాజెక్ట్‌లతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఆమె నటించే ప్రతీ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఈ చిత్రంలో ఆమె నటిస్తే ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్లు వెలువడనున్నాయి.
నీలో ఆ పస లేదు...
వన్ సినిమా : సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకోవడం అంటే కూడా వివాదాస్పద పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ సంచలన పోస్టులు చేస్తుంటారు. ఇక ఈమె టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గురించి నిత్యం చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి.తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనం కౌర్ పోస్ట్ చేస్తూ.. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కనిపించిన వినోదం, మాటల చమత్కారం కనిపించడం లేదంటూ ఈమె తెలియజేస్తూ.. నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో భాగంగా ఈమె త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ చేయడం విశేషం.ఇక ఈ పోస్ట్ తో పాటు పూనమ్ కౌర్ మరొక పోస్ట్ కూడా చేశారు. ఈ పోస్టులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటి కోసం తన భార్యపై చేయి చేసుకుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అయితే అతను ఎవరు అనేది మాత్రం ఈమె ప్రస్తావించకపోయినా, ఈ పోస్టులో గురూజీ అంటూ ప్రస్తావించడంతో కచ్చితంగా ఈ పోస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి చేసిందని తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలో అందరూ గురూజీ అంటూ పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పూనం సైతం గురూజీ అని ప్రస్తావించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఈ పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఈమె ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది.పూనమ్ కౌర్ గతంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ అనంతరం ఈమె కొన్ని సినిమాలలో హీరో చెల్లెలు పాత్రలలో కూడా నటించి సందడి చేశారు అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఈమె సినిమాల కంటే కూడా ఇలాంటి వివాదాస్పదమైన పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాసుని ఉద్దేశించి ఇలాంటి సంచలమైన పోస్టులు ఎన్నో చేసినప్పటికీ తాజాగా ఈమె చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో కూడా చర్చలకు కారణం అవుతుంది.ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండదు కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుంది.
టాలీవుడ్ ‘జెజమ్మ’ పెళ్ళిలో నిజంలేదు
టాలీవుడ్ ‘జెజమ్మ’ అనుష్క శెట్టి త్వరలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆమె టీమ్ చెక్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూనే, వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజూ హెడ్లైన్స్లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆమె టీమ్ పేర్కొంది. “అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం అన్యాయం. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె వయసును (44) ప్రతి పోస్ట్‌లోనూ ఒక వివాదాస్పద అంశంలా హైలైట్ చేయడం. హీరోల వయసు విషయంలో చూపని ఉత్సాహం, కేవలం హీరోయిన్ల విషయంలోనే ఎందుకు కనిపిస్తోంది?” అని టీమ్ ప్రశ్నించింది.అనుష్క తన కెరీర్‌ను కేవలం ప్రతిభతో, ఎంతో హుందాగా నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదని ఆమె టీమ్ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. తన పర్సనల్ లైఫ్‌ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. “వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, కేవలం వ్యూస్ కోసం వాడాల్సిన అంశం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. ఒక వార్తను ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా, గౌరవంగా చూడటం నేర్చుకోండి” అని అనుష్క టీమ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.
మెుదటి రోజు ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ ?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ – పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. రొటీన్ కథ, కథనం బోర్ కొట్టించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పక్కనే విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆఫ్ లైన్ టికెటింగ్ కాకుండా, ఆన్ లైన్ డేటా ప్రకారం ఇండియా వైడ్ గా ఈ చిత్రం 5,359 షోల ద్వారారూ. 31.86 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% గా నమోదైంది. ఆంధ్రా ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక్కడ రూ. 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% గా నమోదైంది. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం రూ.9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం హిందీ సినిమా ‘ధురంధర్ 2’ వేవ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాలతో యూఎస్ మరియు ఇతర దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఓవరాల్‌గా మొదటి రోజు ప్రదర్శన అండర్వెల్మింగ్ గానే మిగిలిందని సినీ వర్గాల అభిప్రాయం.
సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో ఆంధ్రపరేశ్ వెనుకబడింది - చిరంజీవి
హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులకు పలు అవార్డులు అందజేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘సినిమా వాళ్లను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకబడి ఉంది. చంద్రబాబు నాయుడు ‘గద్దర్ అవార్డులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి. సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం పక్క రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు రావాలని, కళాకారులను గౌరవించుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని చిరంజీవి అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ‘నంది అవార్డుల’ పేరును ‘గద్దర్ అవార్డులు’గా మారుస్తూ, సినిమా వాళ్లను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అవార్డులు ఇవ్వాలని అన్నారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు మరి అప్పుడు చిరు ఏమి చేసారో చెప్పాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.