నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

రాజకీయం

19 వార్తలు కనుగొనబడ్డాయి

రాజకీయం

ప్రజాసేవే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు

రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల పరిషత్ పరిధిలోని రెడ్డిగూడెం 1వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బొమ్మిన కోటేశ్వరరావు, రంగాపురం 2వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి నాగేశ్వరరెడ్డి, రెడ్డిగూడెం రెడ్డు సెగ్మెంట్ ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మల్లాది జగదీష్ భార్య సౌందర్య కుమారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు విజయబాబు మండల పార్టీ అధ్యక్షులు జలపాటి వేణుగోపాల్ రెడ్డి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు తాతారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభ్యర్థుల గురించి స్థానికంగా చర్చ జరుగుతోంది. బొమ్మిన కోటేశ్వరరావు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి గత కొంతకాలంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని వారి అనుచరులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అవసరమైన వారికి సాయం చేస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.వీరిద్దరూ విద్యావంతులుగా, విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యా దాన కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు.గ్రామాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని వారు భావిస్తున్నట్లు వారి అనుచరులు తెలిపారు. రెడ్డిగూడెం మండలం మొత్తం మీద 59 మంది ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు వారి నామినేషన్ దాఖలు చేసినారు.

PRASAD M· 6 రోజుల క్రితం
రాజకీయం

*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి, బెదిరించడం ప్రజాస్వామ్యంపై దాడి: కేకే రాజు

*అభ్యర్థుల స్వేచ్ఛను హరించే కుట్రలను సహించేది లేదు – బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలి*విశాఖపట్నం: విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని 14వ వార్డుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  రెడ్డి జీవన కిరణ్మయిని కిడ్నాప్ చేసి, బెదిరింపులకు గురిచేసి, నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని, ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ విసిరేలా ఉన్నాయని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు తీవ్రంగా ఖండించారు.ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాల్సిన రాజకీయ శక్తులు, ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని చూడటం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప, బెదిరింపులు, కిడ్నాప్‌లు, బలవంతపు చర్యల ద్వారా అభ్యర్థులను నియంత్రించాలనుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థుల గొంతు నొక్కాలని చూస్తే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును హరించే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని కేకే రాజు హెచ్చరించారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, బాధిత అభ్యర్థి నుంచి పూర్తి వివరాలు సేకరించి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణల్లో వాస్తవాలను వెలికితీసి, బాధ్యులెవరైనా సరే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధిత అభ్యర్థికి తగిన రక్షణ కల్పించి, ఆమె తన రాజ్యాంగబద్ధమైన హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికలు అంటే ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజాస్వామ్య ప్రక్రియే తప్ప, ప్రత్యర్థులను భయపెట్టి లొంగదీసుకునే వేదిక కాదు. అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, న్యాయంగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించకూడదని కేకే రాజు స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, ప్రతిపక్ష అభ్యర్థుల భద్రతను పరిరక్షించేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతోనే రాజకీయ విజయాలు సాధించాలి తప్ప, బెదిరింపులు, బలవంతపు చర్యలతో కాదని పేర్కొంటూ, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు.

PRASAD · 7 రోజుల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
రాజకీయం

సర్దుబాటు కంటితుడుపేనా ?

---------120 వార్డులకు 1,623 నామినేషన్---------మేయర్ అభ్యర్థి రేసులో 29 మందివిశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు మొత్తం 1,623 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున 493, జనసేన పార్టీ తరఫున 266, భారతీయ జనతా పార్టీ తరఫున 90 నామినేషన్లు నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 359 నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 287 నామినేషన్లు వచ్చాయి. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆశించిన స్థానాలు దక్కని నాయకులు, ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలు అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కూటమి పార్టీలు అభ్యర్థుల జాబితాలను అధికారికంగా ప్రకటించకుండానే కొందరికి నేరుగా బీ ఫారాలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది.జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది ఉన్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో సీట్ల పంపకం పూర్తవడంతో పాటు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు, మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎవరికి ఉంటుందన్న అంశాలపై విశాఖ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

PRASAD · ఒక వారం క్రితం · Andhra Pradesh, Visakhapatnam
రాజకీయం

నన్ను ఎవడరా సస్పెండ్ చేసేది : అల్లు రమణారావు

--------బీసీవై పార్టీ పతనానికి టైం దగ్గర పడింది.--------కార్యకర్తలను బానిసలుగా చూస్తున్నారు. --------"న్యూస్ వన్" తో ఆవేదన వ్యక్త చేసిన అల్లు.విశాఖపట్నం : భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అల్లు రమణారావు యాదవ్ విశాఖపట్నం జిల్లాలో పార్టీ స్థాపన నుండి నిర్విరామముగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నాయకులగా తయారు చేస్తూ పార్టీని క్రమశిక్షణతో నడిపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోనే బీసీవై పార్టీని విశాఖపట్నం జిల్లాలో ముందంజలో ఉంచినటువంటి వ్యక్తి అక్టోబర్ 17వ తారీఖున పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆయనకు బహుమతి పంపించడం జరిగిందని , ఆ యొక్క బహుమతిని తిరస్కరించినట్లు "న్యూస్ వన్" తో అల్లు రమణారావు వెల్లడించారు. తనను సస్పెండ్ చేసే దైర్యం ఎవరికీ లేదని,తన రాజకీయ జీవితం పై బురద జల్లితే సహించేది లేదని అయన స్పష్టం చేసారు.అయితే నా వివరణ అడగకుండా ఎందుకు సస్పెండ్ చేశారో కారణం కూడా కనుక్కోకుండా ఎవరో చెప్పిన మాటలు విని కుట్ర పూర్వకంగా పార్టీ ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది పన్నిన కుట్రలో అధిష్టానం తలవంగి సస్పెన్స్కు కారణమైంది.ఆ యొక్క సస్పెన్షన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని పిఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ యాదవ సంఘం అధికార ప్రతినిధి పల్లా నూకరాజుయాదవ్ డిమాండ్ చేయడం అయినది పార్టీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకున్న నిర్ణయం బోడె రామచంద్ర యాదవ్ పూజలో ఉన్నాడని తెలుసుకొని ఆయనను మభ్యపెట్టి మైకుంలో పెట్టి అంతా నేనే అనుకుని ఆయన పక్కనే ఉంటూ పార్టీని అభివృద్ధి చెందకుండా నాశనానికి పూనుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకపోగా ఇటువంటి చర్యలు తీసుకోవడం పార్టీ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న వారిపై సస్పెన్స్ వేటు వేయడం పార్టీ అభివృద్ధికి ఇది ఆటంకం భవిష్యత్తులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గానీ జిల్లా కమిటీల సభ్యులు గాని పార్టీ నియమ నిబంధనలు ప్రకారం సస్పెండ్ చేయవలసి వస్తే ముందు పంపించవలసిన అవసరం ఉంది వారి వివరణ తీసుకొని వివరణతో సంతృప్తి చెందకపోతే అప్పుడు సస్పెన్స్ వేటు వేయాలి వెంటనే పార్టీ అభివృద్ధి దృష్ట్యా పార్టీలకు కొత్త వ్యక్తుల ప్రవేశించాలన్న పార్టీ ఒక విధివిధానాలు ముందుకు వెళ్లాలన్నా తక్షణమే బోడె రామచంద్ర యాదవ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వెనక్కి తీసుకొని ఆయనకు ఉన్నటువంటి పదవి రాష్ట్ర ఎగ్జిగుటి సభ్యుడుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ,. ఆలస్యం చేయకుండా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సస్పెన్షన్ ఎత్తివేస్తూ అల్లు రమణా యాదవ్ యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం బీసీవై పార్టీ మొండిగా వ్యవహరిస్తే పార్టీ పతనం తప్పదని అల్లు రమణారావు హెచ్చరించారు.

PRASAD · ఒక వారం క్రితం · Andhra Pradesh, Vizianagaram
రాజకీయం

స్ట్రైక్ రేట్ భయపెడ్తుందా ?

----పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక్కటే సరిపోతుందా? ----100 శాతం స్ట్రయిక్ రేట్‌ను కాపాడుకోవడమే లక్ష్యం----జనసేన నాయకుల్లో ఫలితాల టెన్షన్ ----టీడీపీ నేతల అసంతృప్తి  సహకరిస్తుందా ?( న్యూస్ వన్ బ్యూరో )                 ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మరోసారి తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన తిరుగులేని విజయం తర్వాత, ఈ ఎన్నికల్లో స్ట్రయిక్ రేట్ ను కాపాడుకోవడం జనసేనకు ఒక పెద్ద సవాల్‌గా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్నింటిలో గెలిచింది. ఇప్పుడు నాలుగు కార్పొరేషన్ లో మేయర్ పదవులు, 21 మున్సిపాలిటీల్లో పోటీకి సిద్ధమయింది. అయితే శ్రీకాకుళం నుంచి ఇటు అన్ని ప్రాంతాల్లో తమకు ప్రాతినిధ్యం ఉండేలా సర్దుబాటు కు ఓకే చెప్పింది. పవన్ కల్యాణ్ తొలి నుంచి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కన్నా, పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాలని భావిస్తున్నారు. కానీ జనసైనికుల వత్తిడితో మాత్రం కొన్ని ఎక్కువ స్థానాలనే తీసుకున్నారు. వాస్తవానికి జనసేనకు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. కేవలం పవన్ కల్యాణ్ ఇమేజ్, అభిమానుల ఓట్లు జనసేనకు కీలకం. మరొకవైపు సామాజికవర్గం ఓట్లు కూడా ఈసారి పడతాయా? అన్నది అనుమానమే.స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎదుర్కొంటున్న ప్రధాన టెన్షన్లు, వ్యూహాలు అనేకం ఉన్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన విజయం సాధించి 100 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్థాయి ఫలితాలను పునరావృతం చేయాలనే ఒత్తిడి పార్టీపై ఉంది. ఒకవేళ స్ట్రయిక్ రేట్ తగ్గితే, ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. అలాగే 2029 శాసనసభ ఎన్నికల్లో సీట్లను ఈ రిజల్ట్ ను చూసి తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే, గెలిచే అవకాశం ఉన్న పరిమిత స్థానాలను ఎంచుకుని అక్కడ 100 శాతం విజయం సాధించడమే ముఖ్యమని పార్టీ నాయకత్వం భావిస్తోంది.తొలుత 40 శాతం వరకు సీట్లు ఆశించినప్పటికీ, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. జనసేన పార్టీ 6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా చర్చల ప్రకారం 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలకు జనసేన అంగీకరించిందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో మంచి ఆదరణ, బలమైన క్యాడర్ ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించేందుకు కసరత్తు చేసింది. అయితే జనసేన లీడర్లకు రిజల్ట్ టెన్షన్ పట్టుకుంది. అనేక చోట్ల టీడీపీ నేతల నుంచి అసంతృప్తి, అసహనాలు కనిపిస్తుండటం కొంత ఆందోళనకు దారితీస్తుంది. స్థానిక జనసేన ఎమ్మెల్యేలకు కూడా ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. స్థానిక నాయకత్వం పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. పవన్ కల్యాణ్ చరిష్మా కంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకం అని చెబుతున్నారు. స్థానికంగా వారికి ప్రజల్లో ఉండే పలుకుబడితో పాటు జనంతో మమైకమయ్యే తీరు గెలుపోటములను ఖరారు చేస్తుంది. అందుకే జనసేనకు ఇప్పుడు రిజల్ట్ ఫీవర్ పట్టుకుందని చెప్పుకోవాలి.100 శాతం స్ట్రయిక్ రేట్‌ను కాపాడుకోవడమే లక్ష్యం :గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడంతో జనసేనకు భారీ గుర్తింపు లభించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితాలను సాధించాలనే ఒత్తిడి పార్టీపై ఉంది.ఒక్కో స్థానంలో ఓటమి ఎదురైనా స్ట్రయిక్ రేట్ తగ్గుతుంది. దీంతో ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది.అంతేకాదు, 2029 శాసనసభ ఎన్నికల్లో జనసేనకు కేటాయించే స్థానాల విషయంలోనూ ఈ ఫలితాలు ప్రభావం చూపవచ్చనే చర్చ జరుగుతోంది.అందుకే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే, గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలను ఎంచుకోవడానికే పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ కల్యాణ్ కూడా మొదటి నుంచి ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోటీ చేసే స్థానాల సంఖ్య కంటే, బరిలోకి దిగిన చోట్ల విజయం సాధించడం ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక్కటే సరిపోతుందా? :జనసేనకు పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ ప్రధాన బలం. ఆయన అభిమానులు, పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లు గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల స్వభావం భిన్నంగా ఉంటుంది.ఇక్కడ అభ్యర్థికి ఉన్న వ్యక్తిగత పరిచయాలు, స్థానిక ప్రజలతో సంబంధాలు, అందుబాటులో ఉండే తీరు కూడా కీలకమవుతాయి.క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత బలమైన వ్యవస్థ ఉందన్నది కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో ఓట్లు వేసే వారంతా స్థానిక అభ్యర్థులకు మద్దతు ఇస్తారా? సామాజికవర్గాల ఓట్లు కూడా అదే స్థాయిలో వస్తాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని స్థానిక ఎన్నికల్లోనూ అదే విధంగా అంచనా వేయలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.స్థానిక సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ప్రజలతో వారి సంబంధాలు ఫలితాలను ప్రభావితం చేయవచ్చు.జనసేన నాయకుల్లో ఫలితాల టెన్షన్  :ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలు జనసేనకు కీలకంగా మారాయి.పవన్ కల్యాణ్ ఇమేజ్ పార్టీకి అండగా ఉన్నప్పటికీ, ప్రతి స్థానంలోనూ విజయం సాధించాలంటే స్థానికంగా బలమైన నాయకత్వం అవసరం.ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల పార్టీకి రాజకీయంగా విస్తరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఓటములు ఎదురైతే స్ట్రయిక్ రేట్ తగ్గుతుంది.అందుకే పరిమిత స్థానాల్లో పోటీ చేసి, వీలైనన్ని చోట్ల విజయం సాధించాలనే వ్యూహం జనసేనకు ముఖ్యంగా కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు కేవలం స్థానాల గెలుపోటములకే పరిమితం కావు.పార్టీ క్షేత్రస్థాయి బలం, కూటమిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, పవన్ కల్యాణ్ ఇమేజ్ ప్రభావం వంటి అంశాలకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి.గత ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రయిక్ రేట్‌ను జనసేన నిలబెట్టుకుంటుందా? లేక స్థానిక రాజకీయ పరిస్థితులు కొత్త సవాళ్లు విసురుతాయా? అన్నది ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది.

STATE BEURO · ఒక వారం క్రితం · Andhra Pradesh, Visakhapatnam
ప్రకటన (Advertisement)
రాజకీయం

ఏపుగంటి వీర రాఘవులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరిక

----పార్టీలో చేరిన వారందరినీ పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు----స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది.వాడపల్లి :   కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ ఏపుగంటి వీరరాఘవుల తో సహా 50 కుటుంబాలకు చెందినవారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో శుక్రవారం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే  సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వెంటనే కోనసీమ తిరుమల వాడపల్లిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఇంతమంది చేరడం స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయనడానికి నిదర్శనం అన్నారు. తొలిసారిగా శాసనసభ్యునిగా పోటీ చేసినప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగిన మొదట వాడపల్లి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టడం తనకు ఆనవాయితీ అని ఎమ్మెల్యే బండారు గుర్తుచేసుకున్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ వీరరాఘవులు వారి సహచర బృందం తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషకరమన్నారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందన్నారు. మరలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించడం ద్వారా త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడవాలని పట్టణాలను, గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు మూడు ఇంజన్లుగా ఒకే మాట మీద ఒకే బాటలో పయనించినప్పుడు మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూటమి అభ్యర్థులే గెలవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు, వార్డు సభ్యులతో సహా అన్నింటా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.  2029 లో సైతం ఎన్డీఏ కూటమే అధికారంలోకి తిరిగి రాబోతుందన్నారు. అందరూ కలిసి పనిచేసి ఎన్డీఏ కూటమి  తరపున ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరు పోటీ చేస్తున్నా అందరినీ గెలిపించుకోవాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,ముదునూరి వెంకటరాజు( గబ్బర్ సింగ్ ),కరుటూరి నరసింహారావు,కాయల జగన్నాధం,కూసుంపూడి రామకృష్ణరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

GANTA MADHU · 2 వారాల క్రితం · Andhra Pradesh, Kakinada
రాజకీయం

నర్సీపట్నం మున్సిపల్ టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా చింతకాయల పద్మావతి

నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి పేరు ఖరారైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టిడిపి తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడబోతున్నారు. ఆమె శుక్రవారం ఉదయం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ నూకాంబిక ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

SATISH · 2 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
రాజకీయం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: చంద్రబాబు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత సహచర మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నవంబర్‌ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి, రెగ్యులర్‌ పాలనలోకి వెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 100శాతం గెలవాల్సిందేనని చెప్పారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతోపాటు, కూటమి అభ్యర్థుల విజయానికి ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.

MUNI SWAMY · 3 వారాల క్రితం · Andhra Pradesh, Chittoor
రాజకీయం

చిన్న శ్రీనుకు...పెద్ద చిక్కే !

---అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకుడిగా నియామకం---స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే (న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )సీనియర్ రాజకీయ నేత మజ్జి శ్రీనుకు టీడీపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ని అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది. పార్టీలో చేరిన నెలరోజులకు శ్రీనుకు ఈ పదవి అప్పగించడం వెనుక టీడీపీ అసలు ప్లాన్ ఏంటి? ఈ నియోజకవర్గం టీడీపీకి మొదటి నుంచి తల నొప్పిగా తయారు అయ్యిందా? ఈ క్రమంలో దాని వ్యవహారాలను ఆయనకు అప్పగించారా? మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన పట్టు నిలుపుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.విజయనగరం సీనియర్ రాజకీయ నేత మజ్జి శ్రీనుకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని అరకు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించారు. పార్టీలో చేరిన నెల రోజులకు మజ్జి శ్రీనును ఈ పదవిలో నియమించారు. విజయనగరం నుంచి తప్పించి, ఆయనకు అరకు ఎందుకు ఇచ్చారన్నది అసలు ప్రశ్న. ఉమ్మడి ఏపీలో అరకు నియోజకవర్గం టీడీపీ కంచుకోట.అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిశీలకుడిగా నియామకంరాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మొదటి నుంచి ఓటమి ఎదురైన నియోజకవర్గాల్లో అరకు లోక్‌సభ సీటు ఒకటి. విజయనగరం జిల్లాలోని చాలా భాగం అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. శ్రీను రంగంలోకి దింపితే బావుంటుందని భావించింది టీడీపీ హైకమాండ్. అక్కడ దిగువ స్థాయి నుంచి నేతలను బలోపేతం చేస్తే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అరకు సీటు గెలవడం ఈజీ అవుతుందన్నది టీడీపీ అంచనా. ఈ క్రమంలో ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు సీనియర్ల మాట. ఈ పదవిపై అధికారిక ప్రకటన రాకముందు శ్రీను రంగంలోకి దిగేశారు. ఏజెన్సీకి చెందిన కీలక నేతలతో వరసగా సమావేశాలు మొదలు పెట్టేశారు. ఇటీవల పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ భూదేవితో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గంలోకి వచ్చే నేతలతో సమావేశాలు నిర్వహించారు.ఆయా నియోజకవర్గాల్లో శ్రీనుకు పరిచయాలు ఉండడంతో ఈసారి అరకు సీటు టీడీపీ జెండా ఎగురువేయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మూడు ఎన్నికల్లో అరకు సీటును వైసీపీ గెలుస్తూ వస్తోంది. ఆ పార్టీకి బలమైన కేడర్ ఉందని స్థానికుల మాట. రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్ లుంటే అరకు పార్లమెంట్‌లో మూడు జిల్లా పరిషత్‌లు ఉన్నట్లు ఓ లెక్క. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా పరిషత్‌ కూడా అందులోకి వస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అరకు లోక్‌సభ అబ్జర్వర్‌గా శ్రీనుకు నియమించడం పెద్ద టాస్క్ అని అంటున్నారు. చిన్న శ్రీను రంగంలోకి దిగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది టీడీపీ ఆలోచన. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు.

STATE BEURO · 3 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
రాజకీయం

కాంగ్రెస్, కాక్రో‌చ్‌లపై బీజేపీ ఫైర్..!

న్యూ ఢిల్లీ ; ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న తరుణంలో బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో అరాచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం అడ్డుకుందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘దేశాన్ని పార్లమెంట్ పాలిస్తుంది తప్పా వీధులు కాదు’’ అని అన్నారు.ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచేది లేదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను ఆయన సమర్థించారు. గత మూడు రోజులుగా, శనివారం చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. భారత ప్రజాస్వామ్యం అరచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను అడ్డుకుందని, దేశాన్ని పార్లమెంటే పాలిస్తుందని స్పష్టం చేశారు.ఈ నిరసనలు జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలిచిన విషయాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల్ని ‘‘అరాచక ఉద్యమం’’గా అభివర్ణించారు. ‘‘తాము నిరసనలకు వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికల్లో ఓటముల కారణంగా మీరు వీధి పోరాటాను ఆయుధంగా మార్చుకున్నారు’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

SWETHA SINGH · 3 వారాల క్రితం
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)