నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

క్రీడలు

3 వార్తలు కనుగొనబడ్డాయి

క్రీడలు

సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!

( వన్ స్పోర్ట్స్ )భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha)ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. దీనితో ఇప్పుడు అక్టోబర్ 4న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ ను పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా బీసీసీఐ నియమించింది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే దరఖాస్తుదారులను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రమేష్ పవార్ నియామకాన్ని ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. రమేష్ పవార్ భారత జట్టు తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్ రంగంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా, ముంబై, గుజరాత్ జట్ల కోచ్‌గా ఆయన పనిచేశారు. అంతేకాదు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు. భారత మహిళల జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో ఆసియా కప్ టైటిల్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.ఇక మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సేవలను బీసీసీఐ ప్రశంసించింది. 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కాలంలో భారత క్రికెట్ మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు, వరుసగా రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు సాధించింది. సీనియారిటీ పరంగా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. కొత్త పురుషుల సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓఝా (చైర్‌పర్సన్), శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ సభ్యులుగా కొనసాగనున్నారు.

SWETHA· ఒక వారం క్రితం
క్రీడలు

కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ

----రాష్ట్ర స్థాయి పోటీలకు తూర్పుగోదావరి జిల్లా జట్టుకు ఎంపికైన వి. హేమంత్ శ్రీనివాస్ఆలమూరు :  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వి. హేమంత్ శ్రీనివాస్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్టుకు హేమంత్ శ్రీనివాస్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ-1 బి. అప్పాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో హేమంత్ శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకుని జిల్లా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా విద్యార్థి విజయానికి కృషి చేసిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఎన్. వీరాంజనేయులును ప్రధానోపాధ్యాయులు బి. అప్పాజీ అభినందించారు.

GANTA MADHU · 2 వారాల క్రితం · Andhra Pradesh, Kakinada
క్రీడలు

ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం

ఎచ్చెర్ల  (న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ,లోమాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శ,ప్రాయమని డాక్ట‌ర్. బీ.ఆర్ అంబేద్క‌ర్ యూనివ‌ర్సిటీ వైఎస్ చాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్  ప్రొఫెస‌ర్ ర‌జ‌ని కొనియాడారు. అబ్దులక‌లాం జయంతి సందర్భంగా గురువారం యూనివ‌ర్సిటీ ఆవరణలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అంత‌రిక్ష‌, ర‌క్ష‌ణ రంగాల్లో ఆయ‌న ఎన్నో ప‌రిశోధ‌న‌లుచేసి ముందుత‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచార‌ని అన్నారు. శాస్త్రవేత్త‌గా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగానే కాకుండా, రాష్ట్ర‌ప‌తిగా ప‌నిచేసి పీపుల్స్ ప్రెసిడెంట్‌గా కీర్తి గ‌డించార‌ని పేర్కొన్నారు. దేశానికి, స‌మాజానికి క‌లాం అందించిన సేవ‌ల‌ను వీసీ ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ బి. అడ్డ‌య్య‌, అధ్యాప‌కులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RAMA RAO · 2 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)