నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

నేరాలు-ఘోరాలు

24 వార్తలు కనుగొనబడ్డాయి

నేరాలు-ఘోరాలు

ప్రజలకు భరోసా కల్పిస్తూ కదం తొక్కిన పోలీసు బలగాలు||

- ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్విజయనగరం జిల్లా  : విజయనగరం పట్టణంలో జరగనున్న శ్రీ పైడితల్లమ్మ పండగ, ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ అక్టోబర్ 23న విజయనగరం 1వ పట్టణ పీఎస్ నుండి గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్, లైన్స్ క్లబ్ జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్, జొన్నగుడ్డి వరకు పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్,  కవాతులో స్వయంగా పాల్గొని, ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయాలను, బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగవద్దని, పోలీసుశాఖ అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు.

RAJU· 5 రోజుల క్రితం
నేరాలు-ఘోరాలు

కనకధార వెంచర్స్ పై ఈడీ మెరుపు దాడులు

హైదరాబాద్‌ : బ్యాంకుల కన్సార్టియంను మోసగించి వందల కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 నిబంధనల ప్రకారం, ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిధిలోని మొత్తం 7 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి.ఎం/ఎస్ కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేవీపీఎల్) రిజిస్టర్డ్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాలు, అలాగే బ్యాంకు నిధుల మళ్లింపులో మధ్యవర్తులుగా వ్యవహరించిన సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ – బెంగుళూరు) 2022 డిసెంబర్ 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (నం. RC0782022E0005) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఐపీసీ సెక్షన్లు 120-బి, 420, 468, 471లతో పాటు అవినీతి నిరోధక చట్టం-1988 కింద నమోదైన ఈ కేసును ఆధారం చేసుకుని ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని ఐడీబీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూబీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడాలతో కూడిన బ్యాంకుల కన్సార్టియంను కనకధార వెంచర్స్ సుమారు రూ. 326.49 కోట్ల మేర మోసగించినట్లు ప్రధాన ఆరోపణ. బ్యాంకులు మంజూరు చేసిన బ్యాంక్ గ్యారెంటీ (బీజీ), లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ) రుణ సౌకర్యాలను నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. నకిలీ ఉక్కు కొనుగోలు ఇన్‌వాయిస్‌లు, రవాణా పత్రాలను సృష్టించి, బినామీ సంస్థల ద్వారా నిధులను భారీగా దారిమళ్లించారని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, రుణాలిచ్చిన బ్యాంకుల సమాచారం లేకుండా కన్సార్టియం వెలుపల వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఈ సోదాల సందర్భంగా నిధుల మళ్లింపు, లేయరింగ్‌కు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, పలు రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు స్థిరాస్తులు, పెట్టుబడులను గుర్తించడంతో పాటు కీలక ఆస్తుల వివరాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

VASUDEV · 5 రోజుల క్రితం · Telangana, Karimnagar
నేరాలు-ఘోరాలు

జోగి మేఘన కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు..!

---మాజీ మంత్రి జోగి రమేష్‌పై అనుమానం వ్యక్తం చేసిన మేఘన తండ్రి.ఇబ్రహీంపట్నం : తమకు జరిగిన ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని జోగి మేఘన తండ్రి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.          ఈ ఘటనలో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ హస్తం ఉండి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 15న జోగి రమేష్‌ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రం కోదాడ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వీరి కారును ఢీకొనగా వాహనం కొంత భాగం దెబ్బతింది.  బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున విచారణ చేయాలని మేఘన తండ్రి కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పుడే కేసు నమోదు చేశారు.ఇప్పటికే మేఘన.. హత్యాయత్నం, వరకట్న వేధింపుల ఆరోపణలతో మామ రమేష్, భర్త రాజీవ్, మరికొందరు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయడం, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఇబ్రహీంపట్నం పోలీసులకు మూడు నెలల కిందట ఫిర్యాదు చేయగా కేసు నమోదైన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో కారు ప్రమాద ఘటనపై జోగి రమేష్‌ ప్రమేయం ఉండవచ్చని మేఘన తండ్రి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు.

KIRAN BABU · 5 రోజుల క్రితం · Andhra Pradesh, Guntur
నేరాలు-ఘోరాలు

*ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా పటిష్ట పోలీసు బందోబస్తు:

ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి టౌన్ అక్టోబర్ 23: ​రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణ:* జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.*స్వేచ్ఛగా నామినేషన్ల దాఖలు:* ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులెవరైనా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో వచ్చి నామినేషన్లు దాఖలు చేయవచ్చు.*రక్షణ కల్పన:* నామినేషన్ దాఖలు చేయకుండా ఎవరైనా బెదిరించినా, ఆటంకాలు లేదా అడ్డంకులు సృష్టించినా వెంటనే సంబంధిత స్థానిక పోలీసు అధికారులను లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. అటువంటి వారికి తక్షణమే తగిన వ్యక్తిగత భద్రత కల్పించి, నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి నిర్ణీత గడువులోగా సజావుగా నామినేషన్ వేసేలా చర్యలు చేపడతాము.*చట్టపరమైన చర్యలు:* నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడమైనది.​ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరడమైనది.

JAGAN · 5 రోజుల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
నేరాలు-ఘోరాలు

భారతీయుల పడవపై సౌదీ దాడి

---జుకార్ ద్వీపం సమీపంలో ఘటన జరిగినట్లు హౌతీల ఆరోపణ..---14 మంది భారతీయుల్ని రక్షించేందుకు హౌతీల చర్యలు సౌదీ   : ఎర్ర సముద్రంలో భారతీయులతో వెళ్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసినట్లు ప్రకటించింది. జుకార్ ద్వీపం సమీపంలో 14 మంది భారతీయ పౌరులను తీసుకెళ్తున్న పడవపై దాడి జరిగినట్లు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు గురువారం తెలిపారు. పడవలో ఉన్న వారిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిది బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు. ఎర్ర సముద్రంలో జుకార్ ద్వీపం సమీపంలో ఒక భారతీయ పడవను లక్ష్యంగా చేసుకుని సౌదీ దాడి చేసినట్లు యాహ్యా సరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.14 మందిని రక్షించేందుకు హౌతీలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సౌదీ చేసిన దాడిని నిర్లక్ష్యపూరితమైందిగా హౌతీలు అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు కలిగిస్తాయని యహ్యాసరీ అన్నారు. సౌదీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.దాడి జరిగిన ప్రాంతం అత్యంత కీలకమైన జలసంధి బాబ్-అల్-మాండెబ్‌కు సమీపంలో ఉంటుంది. ఇది ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఎడన్‌‌కు అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి కలుపుతుంది. అంతర్జాతీయ నౌకాయానానికి కీకలంగా ఉంది. ప్రస్తుతం పడవలో ఉన్న 14 మంది భారతీయుల పరిస్థితి, సహాయక చర్యల పూర్తి వివరాలు విడుదల కాలేదు. ఈ దాడిపై, హౌతీ వాదనపై సౌదీ అరేబియా ఎలాంటి ప్రకటన చేయలేదు.

CRIME BEURO · 6 రోజుల క్రితం
ప్రకటన (Advertisement)
నేరాలు-ఘోరాలు

ఎన్నికల్లో దౌర్జన్యాలు పాల్పడితే సుప్రీంకోర్టు ఏమి చెబుతుంది

సామాన్య ప్రజలకు మరియు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యేలా 'రోజువారీ న్యాయ సలహా' ఫార్మాట్‌లో రూపొందించిన విశ్లేషణ ఇక్కడ ఉంది :Facts of the Case (నేపథ్యం):ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (అక్టోబర్ 2026) నామినేషన్ల ప్రక్రియలో కొందరు అభ్యర్థులను భౌతికంగా అడ్డుకున్నారని, నామినేషన్ పత్రాలు చించివేశారని, బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల వారు గడువులోగా నామినేషన్లు వేయలేకపోయారని, వారికి మళ్లీ అవకాశం (గడువు పొడిగింపు) ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP (C) No. 37476/2026) దాఖలు చేసింది. అంతకుముందు ఈ గడువు పొడిగింపును ఏపీ హైకోర్టు నిరాకరించింది.Issues (వివాదాస్పద అంశాలు): * అభ్యర్థులను దౌర్జన్యంగా అడ్డుకున్నప్పుడు, గడువు ముగిసిన తర్వాత కూడా నామినేషన్ వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించవచ్చా? * ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత (ఆర్టికల్ 243ZG ప్రకారం) రాజ్యాంగ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా?Section of Law & Constitutional Rights (చట్టం - రాజ్యాంగ నిబంధనలు): * ఆర్టికల్ 243ZA & 243K: మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) పూర్తి స్వయంప్రతిపత్తిని ఇస్తాయి. * ఆర్టికల్ 14, 19(1)(a), 21: చట్టం ముందు సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ, మరియు వ్యక్తిగత భద్రత. పోటీ చేసే ప్రతి అర్హత గల అభ్యర్థికి భయం లేకుండా నామినేషన్ వేసే సమాన అవకాశం కల్పించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రం.Supreme Court Interim Order (సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు):జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ 21, 2026న ఈ కేసులో కీలకమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది: * ఎన్నికల సంఘానిదే బాధ్యత: శాంతిభద్రతల సమస్యలు, హింస లేదా బెదిరింపుల కారణంగా అభ్యర్థులు నిజంగానే నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే.. వారి వినతులను చట్టప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. * 48 గంటల అదనపు గడువు: ఒకవేళ వినతులను పరిశీలించి గడువు పొడిగించాలని ఎన్నికల సంఘం నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ప్రకటించిన సమయం నుండి 48 గంటల పాటు అదనపు గడువు ఇవ్వాలి. * తుది జాబితా ప్రకటన వాయిదా: ఈ పరిశీలన పూర్తయ్యే వరకు, ముందుగా నిర్ణయించిన తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. * పోలీసుల విధి: అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ పర్యవేక్షణ, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది.Action Plan (అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు): * ఎన్నికల్లో నామినేషన్ వేయడం చట్టం కల్పించిన హక్కు. ఎవరైనా మిమ్మల్ని భౌతికంగా అడ్డుకుంటే తక్షణమే రిటర్నింగ్ అధికారి (RO) కి లేదా పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేయండి. * దాడి జరిగిన సమయం, ప్రదేశం వివరాలతో పాటు, వీలైతే సెల్‌ఫోన్ వీడియోలు లేదా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచుకోండి (భారతీయ సాక్ష్య అధినియమం - 2023 ప్రకారం ఇది డిజిటల్ సాక్ష్యంగా పరిగణించబడుతుంది). * కేవలం గడువు ముగిసిందన్న కారణంతో అన్యాయాన్ని సహించకండి. సరైన సాక్ష్యాధారాలు ఉంటే, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి మీ హక్కును కాపాడుకోవచ్చు.(గమనిక: ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశం మాత్రమే, తుది విచారణ పెండింగ్‌లో ఉంది. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కాదు.) న్యాయ సమాచారం - అవగాహన కోసం మాత్రమే 📢

SWETHA · 7 రోజుల క్రితం
నేరాలు-ఘోరాలు

ఎంపీ అవినాష్ రెడ్డితో ...పలువురు అరెస్టు

కర్నూలు జిల్లా  :ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు అరెస్టులు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. వైసీపీ కార్యాలయం వద్ద ముందస్తు చర్యల పేరుతో ఆయనను అరెస్ట్ చేసి, కడప టౌన్ పరిధి దాటించి వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పలువురు జడ్పీటీసీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.                    ఇక కర్నూలు జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్దుర్తిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో ఆమెను వెళ్లకుండా అడ్డుకోవడంతో, శ్రీదేవి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని, శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిమర్రిలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదంటూ కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొండంగిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నిన్న తొండంగి ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, రాళ్ల దాడి జరగడంతో రాజా నాలుగు గంటల పాటు బైఠాయించిన విషయం తెలిసిందే. నేడు మరోసారి నామినేషన్లకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో స్థానిక ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.

MUNI SWAMY · 7 రోజుల క్రితం · Andhra Pradesh, Kurnool
నేరాలు-ఘోరాలు

నందలూరులో ... గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!

కడప జిల్లా  :  వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకోవడంతో నందలూరు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. నందలూరుకు చెందిన ఎద్దుల విజయసాగర్‌కు మద్దతుగా టీడీపీ రాజంపేట ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎలైట్ ఆస్పత్రి అధినేత డాక్టర్ బాలసుబ్రమణ్యం వర్గం నిలిచింది. మరోవైపు మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం నుంచి అభ్యర్థి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా పరస్పర దాడులకు దారితీసింది.ఘర్షణ తీవ్రరూపం దాల్చి పరిస్థితి అదుపుతప్పుతున్న సమయంలో టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రమణ్యం తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో మేడా విజయశేఖర్‌రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆందోళనకారులు రెండు కార్లకు నిప్పుపెట్టడంతో అవి దగ్ధమయ్యాయి. అలాగే పలు ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను నందలూరుకు తరలించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో నందలూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులు, వాహనాల దహనం వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

CRIME BEURO · 7 రోజుల క్రితం · Andhra Pradesh, Chittoor
నేరాలు-ఘోరాలు

భారతీయుల పడవపై సౌదీ దాడి

---జుకార్ ద్వీపం సమీపంలో ఘటన జరిగినట్లు హౌతీల ఆరోపణ..---14 మంది భారతీయుల్ని రక్షించేందుకు హౌతీల చర్యలు సౌదీ   : ఎర్ర సముద్రంలో భారతీయులతో వెళ్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసినట్లు ప్రకటించింది. జుకార్ ద్వీపం సమీపంలో 14 మంది భారతీయ పౌరులను తీసుకెళ్తున్న పడవపై దాడి జరిగినట్లు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు గురువారం తెలిపారు. పడవలో ఉన్న వారిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిది బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు. ఎర్ర సముద్రంలో జుకార్ ద్వీపం సమీపంలో ఒక భారతీయ పడవను లక్ష్యంగా చేసుకుని సౌదీ దాడి చేసినట్లు యాహ్యా సరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.14 మందిని రక్షించేందుకు హౌతీలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సౌదీ చేసిన దాడిని నిర్లక్ష్యపూరితమైందిగా హౌతీలు అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు కలిగిస్తాయని యహ్యాసరీ అన్నారు. సౌదీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.దాడి జరిగిన ప్రాంతం అత్యంత కీలకమైన జలసంధి బాబ్-అల్-మాండెబ్‌కు సమీపంలో ఉంటుంది. ఇది ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఎడన్‌‌కు అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి కలుపుతుంది. అంతర్జాతీయ నౌకాయానానికి కీకలంగా ఉంది. ప్రస్తుతం పడవలో ఉన్న 14 మంది భారతీయుల పరిస్థితి, సహాయక చర్యల పూర్తి వివరాలు విడుదల కాలేదు. ఈ దాడిపై, హౌతీ వాదనపై సౌదీ అరేబియా ఎలాంటి ప్రకటన చేయలేదు.

CRIME BEURO · 7 రోజుల క్రితం
నేరాలు-ఘోరాలు

ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత.. చెక్‌పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ

----గుమ్మ లక్ష్మిపురం జంక్షన్ చెక్‌పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డిపార్వతీపురం మన్యం జిల్లా : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఎఫ్‌ఎస్‌టీ, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో 24 గంటల నిఘా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22న గుమ్మలక్ష్మిపురం గ్రామం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఎస్పీ తనిఖీ చేసి, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహనాల తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల రవాణాను అరికట్టేందుకు నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళి (MCC) అమలులో ఉన్న సమయంలో నిబంధనలను అనుగుణంగా నగదు, ఇతర వస్తువులు తీసుకెళ్ళే వారిదగ్గర వాటికీ తగ్గ అనుమతి పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలని, తనిఖీల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని అప్రమత్తతతో పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళి (MCC) ఉల్లంఘించిన, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించిన వారిపై కఠిన చర్యలు తీసికోవాలని లేదా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీతో పాటుగా ఎల్విన్పేట ఎస్సై శివప్రసాద్, చెక్ పోస్ట్ సిబ్బంది* పాల్గొన్నారు.

SUDHAKAR · 7 రోజుల క్రితం · Andhra Pradesh, Vizianagaram
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)