ఆరోగ్యం
7 వార్తలు కనుగొనబడ్డాయి
ఆరోగ్యం
జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ పై గోడ పత్రిక విడుదల
విశాఖపట్నం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు జిల్లా ప్రోగ్రాం అధికారులతో కలిసి జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమం (National Iodine Deficiency Disorders Control Programme – NIDDCP) గోడ పత్రికను మరియు బ్యానర్ ను ఆవిష్కరించారు. తదుపరి పత్రికా ముఖంగా మాట్లాడుతూ అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు ప్రజల్లో అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియచేసారు. అయోడిన్ మన శరీర ఎదుగుదలకు, ముఖ్యంగా పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి ఎంతో అవసరమైన పోషక పదార్థం. శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడితే గాయిటర్ (గొంతు వాపు), పిల్లల్లో ఎదుగుదల లోపాలు, మానసిక వికాసానికి సంబంధించిన సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించడం, ఉప్పును సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం, సమతుల్య ఆహారపు అలవాట్లను పాటించడం వంటి అంశాలపై అవగాహనపెంపొందించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs) మరియు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, పాఠశాల విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అయోడిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా అయోడిన్ లోప రుగ్మతలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.అయోడిన్ మన శరీరానికి కావలసిన ఒక సూక్ష్మ పోషకం .అయోడిన్ లోప రుగ్మతుల నివారణకు-అయోడైజ్డ్ ఉప్పునే వాడండి .పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అయోడిన్ ఉప్పునే వాడండి . మీరు తినే ఆహారంలో అయోడిన్ లోపం ఉన్నట్లు అయితే – గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం, మృత శిశుజననాల, నెలలు నిండకుండా ప్రసవం మరియు జన్మించిన పిల్లలలో పుట్టుకతో లోపాలు సంభవించవచ్చు. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపిస్తే పిల్లలలో మరగుజ్జుతనం, బుద్ధి మాంద్యం, చెవుడు, మూగ వంటి వైకల్యములు సంభవిస్తాయి- వీటిని నివారించడానికి అయోడిన్ ఉప్పునే వాడండి .అయోడిన్ లోపం వాళ్ళ థైరాయిడ్ గ్రంధి పెరిగి గొంతు వద్ద వాపు ఏర్పడుతుంది. దీనినే " గాయిటర్ " అంటారు. అందుకే ఎప్పుడు మంచి అయోడిన్ గల ఉప్పునే వాడండి అని సూచించారు.ఈ కార్యక్రమంలో బాగంగా జీ.వి.ఎం.సి. హైస్కూల్ మధురానగర్ నందు ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.హారిక, మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొని పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం, బి.నాగేశ్వర రావు, డెమో, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, డా.బి.హారిక, ఆర్.బి.ఎస్.కె.జిల్లా సమన్వయకర్త, ఎం.సత్యవతి, డి.పి.హెచ్.ఎన్.ఒ, బి.నాగభూషణరావు, అసిస్టెంట్ మలేరియా అధికారి వారు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్ చేసేలా సమగ్ర కార్యాచరణ : ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య
విజయవాడ, అక్టోబర్ 22: గోదావరి పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి, వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సమర్థవంతంగా సేకరించి రీసైక్లింగ్ చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై రాష్ట్రంలోని ప్రముఖ బేవరేజ్ సంస్థల ప్రతినిధులతో గురువారం విజయవాడలోని ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, వివిధ బేవరేజ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై ప్రత్యేక దృష్టి :గోదావరి పుష్కరాలు కుంభమేళా తరహాలో భారీ స్థాయిలో నిర్వహించనున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని, ఈ సమయంలో తాగునీరు, పానీయాల సరఫరా ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైన మేరకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా వృక్షాధారిత పదార్థాలు, పేపర్ వంటి వాటితో రూపొందించిన పర్యావరణహిత సీసాలు, ఇతర ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ విధానాల వినియోగంపై పరిశ్రమలు పరిశీలన చేయాలని కోరారు. తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు :పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ సీసాలకు బదులు అవసరమైన ప్రాంతాల్లో వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయడం, పునర్వినియోగానికి అనువైన సీసాలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని బేవరేజ్ సంస్థలకు సూచించారు.పరిశ్రమలు తమ వనరులు, సామర్థ్యానికి అనుగుణంగా పుష్కర ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా కోసం స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ, రీసైక్లింగ్‌కు పటిష్టమైన వ్యవస్థ :పుష్కరాల సమయంలో విక్రయించే లేదా పంపిణీ చేసే ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగం అనంతరం నిర్లక్ష్యంగా పడవేయకుండా, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేసే వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకోవాలని డా. పి. కృష్ణయ్య సూచించారు.బాటిళ్ల సేకరణ కోసం తగిన కేంద్రాలను ఏర్పాటు చేయడం, వ్యర్థాలను ఇతర చెత్త నుంచి వేరు చేయడం, సేకరించిన బాటిళ్లను అధీకృత రీసైక్లింగ్ సంస్థలకు తరలించడం, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగించడం వంటి చర్యలపై దృష్టి సారించాలన్నారు. పుష్కర ప్రాంతాల్లో స్థానిక సంస్థలు, పారిశుధ్య సిబ్బంది, బేవరేజ్ కంపెనీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేవలం బాటిళ్లను సేకరించడంతో ముగియకూడదని, వాటిని సరైన విధానంలో రీసైక్లింగ్ చేయించే వరకు బాధ్యతాయుతమైన వ్యవస్థ ఉండాలని ఛైర్మన్ పేర్కొన్నారు. అలానే పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం, సేకరణ, రీసైక్లింగ్ వివరాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించడం అవసరమని ఛైర్మన్ స్పష్టం చేశారు. పుష్కరాల కోసం ఎన్ని ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముడయ్యాయి, ఎన్ని ఉచితంగా పంపిణీ అయ్యాయి, వాటిలో ఎన్ని తిరిగి సేకరించబడ్డాయి, ఎంత పరిమాణంలో రీసైక్లింగ్‌కు పంపించారు, ఇంకా ఎంత వ్యర్థం మిగిలిపోయింది అనే వివరాలను నమోదు చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హిందుస్థాన్ కోకా-కోలా, రిలయన్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్, ఆర్టోస్ తదితర సంస్థల ప్రతినిధులు. వాటర్ డిస్పెన్సర్ల ఏర్పాటు, తాగునీరు మరియు పానీయాల సరఫరా, ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ, రీసైక్లింగ్ వంటి అంశాలపై వివిధ ప్రతిపాదనలు చర్చించారు.పుష్కరాల సందర్భంగా తమ సంస్థల ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలు, అందించగల సహకారం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు అనుసరించనున్న విధానాలు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను పదిహేను రోజుల్లోగా సమర్పించాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఛైర్మన్ కోరారు.గోదావరి పుష్కరాలను పర్యావరణహితంగా నిర్వహించడంలో ప్రభుత్వ శాఖలతో పాటు పరిశ్రమలు, స్థానిక సంస్థలు, ఇతర భాగస్వాములు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు, గోదావరి నది, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను కాపాడటం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య పేర్కొన్నారు.
యనమల రామకృష్ణుడుకు అస్వస్థత
--- కుటుంబసభ్యులుతో మాట్లాడిన సీఎం చందరబాబు నాయుడు కాకినాడ జిల్లా : మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వైద్యులు, యనమల కుటుంబసభ్యులు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఆయన అనారోగ్య సమస్యలతో అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యు్లు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణుడిని పరీక్షించిన డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యనమల అస్వస్థకు గురయ్యారని తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చంద్రబాబు రామకృష్ణుడి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.ఇటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.. అక్కడ యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. యనమల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.. కొంతమంది ఆస్పత్రి వద్దకు వచ్చారు. యనమల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేయాల్సి ఉంది.యనమల రామకృష్ణుడు 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1985 1989 మధ్య మంత్రిగా.. 1989 నుంచి 1994 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1995 నుంచి 1999 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన 1999 నుంచి 2003 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 మధ్య కాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన తుని నుంచి పోటీచేసి ఓడిపోయారు.. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత యనమల ఏపీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు.. మళ్లీ ఆయన సోదరుడు కృష్ణుడు పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య టీడీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. యనమల టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.
* సింహాచలంలో 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞం:
-- దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు వెల్లడి.-- ఈ నెల 11న రాజగోపురం ప్రాంగణంలో సామూహిక సూర్యనమస్కారాలు-- ‘ఓమ్ ఫ్రీ యోగా సెంటర్’ సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు-- భక్తులు, యోగసాధకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈవో పిలుపుసింహాచలం:10 అక్టోబర్ 2026 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో సింహగిరిపై సామూహిక సూర్యనమస్కారాల మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.ప్రముఖ ‘ఓమ్ (AUM) ఫ్రీ యోగా సెంటర్’ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ (ఆదివారం) ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు రాజగోపురం ఎదుట పవిత్ర వాతావరణంలో 108 రౌండ్ల సూర్యనమస్కారాల ప్రదర్శన జరగనుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. అరసవల్లి, కోణార్క్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సూర్యనమస్కారాలు నిర్వహించి, వరల్డ్ రికార్డు సాధించిన ‘ఓమ్ ఫ్రీ యోగా’ వ్యవస్థాపకులు డాక్టర్ చిలుకా వెంకటరమేష్ శిక్షణలో సుమారు 300 మందికి పైగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వివరించారు.భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆరోగ్య స్పృహను కలిగించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దేవస్థానం సిబ్బందితో పాటు భక్తులు, యోగాభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో పిలుపునిచ్చారు.ఆదివారం,ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు,రాజగోపురం ప్రాంగణం, లో తెల్లటి టీ-షర్ట్ నల్లటి ప్యాంట్ తో,యోగాపై ఆసక్తి ఉన్న భక్తులు, సాధకులందరూ పాల్గొనవచ్చునని ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు
నేటినుంచి జిల్లాలో "ఆపరేషన్ క్లీన్ స్వీప్"
జూన్ 20 వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలుఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్విజయనగరం, మే 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" మహా యజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మే 22 నుండి జూన్ 20, 2026 వరకు నాలుగు వారాల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తెలిపారు. గురువారం తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.నాలుగు వారాల కార్యాచరణ ప్రణాళిక : స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 ప్రమాణాల ఆధారంగా ఈ డ్రైవ్‌ను నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు.మొదటి వారం (మే 22 – మే 28): గత స్వచ్ఛ సర్వేక్షన్లో గుర్తించిన రెడ్, ఎల్లో బ్లాక్ స్పాట్ల నిర్మూలన, ప్రధాన రహదారులు, జంక్షన్ల క్లీనింగ్, రోడ్ మార్కింగ్స్ మరియు కర్బ్ పెయింటింగ్స్.రెండవ వారం (మే 29 – జూన్ 4): వర్షాకాలానికి ముందే వరద కాలువలు, నాలాల పూడికతీత మరియు ఇరుకైన సందుల లోతైన శుభ్రత. మూడవ వారం (జూన్ 5 – జూన్ 11): నివాస, వాణిజ్య సముదాయాలలో 100% తడి-పొడి చెత్త వర్గీకరణ. బల్క్ వేస్ట్ ఉత్పత్తిదారులుచేత మేనేజ్మెంట్ నియమాల అమలు.నాల్గవ వారం (జూన్ 12 – జూన్ 20): అన్ని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్ల సంపూర్ణ శానిటైజేషన్, చెత్త వేసే సమస్యాత్మక ప్రాంతాల పూర్తి నిర్మూలన.కఠిన చర్యలు - పారదర్శకత: నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, మార్కెట్లు, కల్యాణ మండపాలపై కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయి.జియో-ట్యాగింగ్: 'జియోస్టాట్ టీమ్' అనే థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా పనులకు ముందు, తర్వాత ఫోటోలను జియో-ట్యాగ్ చేసి రోజువారీ నివేదికలను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.డ్యాష్‌బోర్డ్ పరిశీలన: మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా మైక్రో ప్లాన్స్ సిద్ధం చేసి, ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపు వివరాలను ఎమ్ఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలి.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యం: ఒకే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీల్లో ఏకకాలంలో నిర్వహించిన అతిపెద్ద క్లీన్లీనెస్ డ్రైవ్‌గా దీనిని నిలిపి, "గిన్నిస్ వరల్డ్ రికార్డ్" సాధించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జియోస్టాట్ బృందాలు డాక్యుమెంటేషన్ సిద్ధం చేస్తున్నాయి. ఈ రికార్డులో విజయనగరం జిల్లా ముందుండాలని ఇంచార్జి కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ డ్రైవ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఉత్తమ మున్సిపాలిటీలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు మరియు ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ కేసుల పెరుగుదలపై అవగాహన అవసరం: మెడికవర్ నిపుణులు
విశాఖపట్నం : ప్రపంచ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు IBD పై ముందస్తు నిర్ధారణ, ప్రజల్లో అవగాహన మరియు సమయానుకూల వైద్యం అత్యంత కీలకమని తెలిపారు. ఈ ఏడాది థీమ్ “IBD Has No Borders – Access to IBD Care” ద్వారా ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేస్తున్నట్లు చెప్పారు.డా. అనిరుద్ కొవ్వలి , కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాట్లాడుతూ అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి IBD కేసులు ప్రస్తుతం యువతలో వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక యాంటీబయోటిక్ వినియోగం వంటి కారణాలు ఈ వ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయని చెప్పారు.దీర్ఘకాలిక విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. ఆలస్యమైన నిర్ధారణ వల్ల పేగు సమస్యలు, పోషకాహార లోపం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బయోలాజిక్ థెరపీలు, ఆధునిక చికిత్సలు మరియు జీవనశైలి మార్పులతో IBD ను సమర్థంగా నియంత్రించవచ్చని తెలిపారు. సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ, పరిశుభ్రత, క్రమం తప్పని వైద్య పరీక్షలు ఆరోగ్య పరిరక్షణకు కీలకమని నిపుణులు సూచించారు.
🎗️ క్యాన్సర్ లో రకాలు (Types of Cancers)
క్యాన్సర్ అనేది శరీరంలోని ఏ భాగంలోనైనా మొదలవ్వచ్చు. ప్రధానంగా కణాల రకాన్ని బట్టి వీటిని ఇలా వర్గీకరిస్తారు: *కార్సినోమా (Carcinoma* ): ఇది అత్యంత సాధారణమైన రకం. చర్మం లేదా అంతర్గత అవయవాల ఉపరితలం (ఎపిథీలియల్ కణాలు) నుండి ఉత్పన్నమవుతుంది. *ఉదాహరణలు:* ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. *సార్కోమా (Sarcoma* ): ఎముకలు, కండరాలు, మృదులాస్థి (Cartilage), కొవ్వు మరియు రక్తనాళాలు వంటి సంధాయక కణజాలాలలో (Connective Tissues) ప్రారంభమవుతుంది *లుకేమియా (Leukaemia):* ఇది 'బ్లడ్ క్యాన్సర్' (రక్త క్యాన్సర్) గా ప్రసిద్ధి చెందింది. ఇది ఎముక మజ్జ (Bone Marrow) లో ప్రారంభమై, తెల్ల రక్త కణాల (White Blood Cells) ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.లింఫోమా మరియు మైలోమా *(Lymphoma and Myeloma):* ఇవి రోగనిరోధక వ్యవస్థ కణాలలో (Immune System Cells) మొదలయ్యే క్యాన్సర్లు. *లింఫోమా* : లింఫ్ గ్రంథులు (Lymph nodes) మరియు లింఫ్ వ్యవస్థలో మొదలవుతుంది.మెదడు మరియు వెన్నుపాము క్యాన్సర్లు (Brain and Spinal Cord Cancers): ఇవి కేంద్ర నాడీ వ్యవస్థలో (Central Nervous System) ఉత్పన్నమవుతాయి. *వైద్య నిలయం డాక్టర్ సలహాలు (Doctor's Advice for Prevention)*1. *జీవనశైలి మార్పులు (Lifestyle Changes)* *ధూమపానం మానేయండి* : పొగాకు (Smoking, Chewing Tobacco) వినియోగం ఊపిరితిత్తులు, నోరు, గొంతు, మూత్రాశయం వంటి అనేక క్యాన్సర్లకు ప్రధాన కారణం. దీనిని పూర్తిగా మానేయాలి. *ఆరోగ్యకరమైన ఆహారం* : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (Whole Grains) ఎక్కువగా తీసుకోండి. ప్రాసెస్ చేసిన మాంసాలు (Processed meats), ఎర్ర మాంసం (Red meat) మరియు చక్కెర పానీయాలను తగ్గించండి. *బరువు అదుపు* : స్థూలకాయం (Obesity) క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువును పాటించండి. *క్రమం తప్పని వ్యాయామం:* ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. *మద్యపానం పరిమితం* : ఆల్కహాల్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా పరిమితం చేయడం మంచిది. *సూర్యరశ్మి నుండి రక్షణ* : అధిక సూర్యరశ్మికి గురికాకుండా చర్మాన్ని రక్షించుకోండి (చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి).2. *క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం (Recognizing Symptoms* )శరీరంపై గడ్డలు (Lumps) లేదా వాపు (Swelling) ఏర్పడటం.ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం (Unexplained weight loss).మానని పుండ్లు (Sores that don't heal) లేదా దీర్ఘకాలిక దగ్గు (Persistent cough).మలమూత్ర విసర్జన అలవాట్లలో లేదా గొంతులో మార్పులు.అసాధారణ రక్తస్రావం (Unusual bleeding) (ఉదా: మలంలో రక్తం, రుతుస్రావం కాని సమయంలో రక్తస్రావం).3. *స్క్రీనింగ్ పరీక్షలు (Screening Tests)* ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చాలా ముఖ్యం. మీ వయస్సు మరియు ప్రమాద కారకాలను బట్టి వైద్యులు ఈ పరీక్షలను సూచిస్తారు:రొమ్ము క్యాన్సర్: మహిళలకు మామోగ్రామ్ (Mammogram).గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer): మహిళలకు ప్యాప్ టెస్ట్ (Pap Test) మరియు HPV టీకా.పెద్దపేగు క్యాన్సర్: కొలనోస్కోపీ (Colonoscopy).పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్: PSA పరీక్ష.పైన పేర్కొన్న లక్షణాలు అన్నీ క్యాన్సరే కానప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.