దేవాలయాలు
4 వార్తలు కనుగొనబడ్డాయి
దేవాలయాలు
అప్పన్న కొండపై వైభవంగా దేవస్థానం ధర్మకర్మల మండలి ప్రమాణస్వీకారం
సింహాచలం, 21 మే 2026:శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్మల మండలి (ట్రస్ట్ బోర్డ్) ప్రమాణస్వీకార మహోత్సవం గురువారం కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యులచే శాస్త్రోక్తంగా ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మరియు నరసాపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆర్. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్ (ఆన్‌లైన్) ద్వారా హాజరై, నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రమాణస్వీకారం చేసిన ధర్మకర్మల మండలి సభ్యులు: పూసపాటి అశోక్ గజపతిరాజు (వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్)మాకేన సీతారాం పాత్రుడు (నవీన్)కాసిరెడ్డి దామోదర్చలమూరి భారతికారక దేవుడు కనకాల మురళీమోహన్ వెంపడాపు అన్నపూర్ణబీతాల నీరజ లక్ష్మీ కుమారిమధుపద సన్యాసి రావు డాక్టర్ ధరణి బండ్ల నీతిపల్లి మహేష్పెద్దిశెట్టి ఉష శ్రీలలిత జ్యోతిగుత్తికొండ శ్రీలతసుసరపు గణపతి రావుచల్లాంగి జ్ఞానేశ్వరిపావులూరి శ్రీనివాస రావుఎక్స్ అఫిషియో సభ్యులు:గూడవర్తి శ్రీనివాస ఆచార్యులు (ఆలయ ప్రధాన అర్చకులు)ప్రత్యేక ఆహ్వానితులు: బొక్కం స్వామి నాయుడు వేదుల దక్షిణామూర్తినూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, సభ్యుల కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు
వైభవంగా శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవి ప్రమాణ స్వీకారం!
ఓల్డ్ టౌన్ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక పరిషత్ వారి ఉత్తర్వులు అనుసరించి విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సి హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ధర్మ కర్తల మండలి సభ్యులచే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మ కర్తల మండలి సభ్యులుగా సురాడ రాజ్ కుమార్, బుదిరెడ్ల సత్యనారాయణ, రాయ రాము, ఉప్పలపు ఆదిలక్ష్మి, సరిపల్లి జ్యోతి, పుక్కల కళ్యాణి, మానేపల్లి రమణి, నాగమల్లి భాస్కర రావు, బోనగిరి విజయదుర్గ, మంత రాజశేఖర్, మంత్రి శాలివాహన్ మరియు ఎక్స్- అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి జగన్నాథ ఆచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా సురాడరాజ్ కుమార్ ని పై సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభ్యులందరినీ అభినందిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఆలయ పరిరక్షణకై శ్రమిస్తూ భక్తుల మన్నలను పొందెలాగ కూటమి ప్రభుత్వమునకు, దేవాలయానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీస్కొనిరావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ రెడ్డి, శ్కందులనాగరాజు, మాసిపోగురాజు, కోరుకొండ ప్రసాద్ కేదారి లక్ష్మి , మజ్జి త్రినాథ్, గోడి నరసింహచారి, ఓదూరు శివయ్య మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, ధర్మకర్తల మండలి వారి బంధువులు, మిత్రులు సమక్షమున ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రసాదం, మజ్జిగ, అందచేయగా దేవస్థానం ఏర్పాట్లు పై అందరూ హర్షం వ్యక్తంచేశారు.
శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు
తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్‌లు నిండిపోయి రింగ్ రోడ్‌లోని గోగర్భం డ్యాం వరకు వేచి ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్లు క్యూలైన్‌లో బారులు తీరారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం వేగంగా చేయిస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులకు తాగు నీరు, పాలు, అన్న ప్రసాదాలు.. శ్రీవారి సేవకుల సాయంతో అందిస్తున్నారు.
శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ మహోత్సవం
లలితానగర్ : విశాఖపట్నం,లలితానగర్ లో వేంచేసివున్నా శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఈ నెల ఐదొవ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు.అమ్మవారిని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.బుధవారం వైశాఖ మాస బహుళ ఏకాదశి తొలేలు పండుగ - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేకంగా జలాభిషేకములు, పాలాభిషేకములు నిర్వహించనున్నారు.15-05-2026 న వైశాఖ మాస బహుళ ద్వాదశి గురువారం పరస కార్యక్రమము - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు, పసుపు కుంకుమలతో అభిషేకములు జరుగును. సాయంత్రం 5-00 గంటల నుండి అమ్మవారి “పల్లకీ” ఊరేగింపు మరియు అమ్మవారి "సారె" ఊరేగింపు మరియు "పరస" వినోద కార్యక్రమములు జరుగును 05-2026: వైశాఖ మాస బహుళ త్రయోదశి శుక్రవారం అనుపు కార్యక్రమము - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేకమైన జలాభిషేకములు, పంచామృత అభిషేకములు, పాలు, గంధం, కుంకుమలతో ప్రత్యేకంగా అభిషేకమలు జరుగును. సాయంత్రం 5-00 గంటల నుండి సదనపట్టు నుండి అమ్మవారి తిరువీధి ఊరేగింపుతో అనుపు కార్యక్రమము జరుగును, మేళతాళములు, పులివేషములు, దేవి డ్యాన్సులు, దాసులు, తప్పెటగుళ్ళు, సన్నాయి మేళం, కనులు మిరుమిట్లు గొలిపే లైటింగ్ లతో కడువైభవంగా జరుగును 22-05-2026 అధిక జ్యేష్ఠ మాస శుద్ధ సప్తమి శుక్రవారం మారువారం పండుగ - ఉదయం 06-00 గం॥ నుండి అమ్మవారి దర్శనము, జలాభిషేకము, ప్రత్యేక అభిషేకములు, పసుపు కుంకమ అభిషేకములు జరుగును. సాయంత్రం 6-00 గంటల నుండి మారువారం పండుగు జరుపబడును..చివరిగా 25-05-2026: అధిక జ్యేష్ఠ మాస శుద్ద నవమి సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమము జరుగను. కావున అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాములు భక్తులు పొందాలని ఆలయ కమిటీ తెలిపింది.