లలితానగర్ :
విశాఖపట్నం,లలితానగర్ లో వేంచేసివున్నా శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఈ నెల ఐదొవ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు.అమ్మవారిని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.బుధవారం వైశాఖ మాస బహుళ ఏకాదశి తొలేలు పండుగ - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేకంగా జలాభిషేకములు, పాలాభిషేకములు నిర్వహించనున్నారు.15-05-2026 న వైశాఖ మాస బహుళ ద్వాదశి గురువారం పరస కార్యక్రమము - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు, పసుపు కుంకుమలతో అభిషేకములు జరుగును. సాయంత్రం 5-00 గంటల నుండి అమ్మవారి “పల్లకీ” ఊరేగింపు మరియు అమ్మవారి "సారె" ఊరేగింపు మరియు "పరస" వినోద కార్యక్రమములు జరుగును 05-2026: వైశాఖ మాస బహుళ త్రయోదశి శుక్రవారం అనుపు కార్యక్రమము - ఉదయం 05-00 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేకమైన జలాభిషేకములు, పంచామృత అభిషేకములు, పాలు, గంధం, కుంకుమలతో ప్రత్యేకంగా అభిషేకమలు జరుగును. సాయంత్రం 5-00 గంటల నుండి సదనపట్టు నుండి అమ్మవారి తిరువీధి ఊరేగింపుతో అనుపు కార్యక్రమము జరుగును, మేళతాళములు, పులివేషములు, దేవి డ్యాన్సులు, దాసులు, తప్పెటగుళ్ళు, సన్నాయి మేళం, కనులు మిరుమిట్లు గొలిపే లైటింగ్ లతో కడువైభవంగా జరుగును
22-05-2026 అధిక జ్యేష్ఠ మాస శుద్ధ సప్తమి శుక్రవారం మారువారం పండుగ - ఉదయం 06-00 గం॥ నుండి అమ్మవారి దర్శనము, జలాభిషేకము, ప్రత్యేక అభిషేకములు, పసుపు కుంకమ అభిషేకములు జరుగును. సాయంత్రం 6-00 గంటల నుండి మారువారం పండుగు జరుపబడును..చివరిగా 25-05-2026: అధిక జ్యేష్ఠ మాస శుద్ద నవమి సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమము జరుగను. కావున అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాములు భక్తులు పొందాలని ఆలయ కమిటీ తెలిపింది.
శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ మహోత్సవం
దేవాలయాలు
PRASAD
2 నెలల క్రితం
AI సారాంశం
లలితానగర్ : విశాఖపట్నం,లలితానగర్ లో వేంచేసివున్నా శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఈ న
మొదటి వ్యాఖ్య రాయండి!