నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

లీగల్ వార్తలు

15 వార్తలు కనుగొనబడ్డాయి

లీగల్ వార్తలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జూన్‌ 1న నోటిఫికేషన్‌..ఏపీలో  నాలుగు స్థానాలుజూన్‌ 18న రాజ్యసభ ఎన్నికలు, అదే రోజు ఫలితాలున్యూ ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ జూలైలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభసభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. జూన్ 1న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నది ఎలక్షణ్ కమిషన్. కర్ణాటక నుంచి పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యులు.. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్డీ దేవగౌడ. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయసింగ్ పదవీ కాలం ముగియనుంది.

CHANDU· ఒక నెల క్రితం
లీగల్ వార్తలు

కాక్రోచ్ "ఎక్స్" అకౌంట్ నిలిపివేత

( న్యూస్ ప్రత్యేక ప్రతినిధి )ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పొలిటికల్ శటైరికల్ అకౌంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది. భారతీయ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ అకౌంట్‌ను భారత్‌లో ఎక్స్ (ట్విట్టర్) సంస్థ నిలిపివేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ అకౌంట్, ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ రేంజ్‌లో దూసుకుపోతూ, మంచి మొమెంటం అందుకుంటున్న సమయంలోనే ఈ అకౌంట్‌పై నిషేధం పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న పాప్-అప్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ, “మనం ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో విత్‌హెల్డ్ చేశారు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్‌లో `@CJP_2029` అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ అని బోల్డ్ అక్షరాలతో కనిపిస్తోంది. అంతేకాదు, ఒక చట్టపరమైన డిమాండ్ (లీగల్ డిమాండ్) కు స్పందనగా భారతదేశంలో ఈ అకౌంట్‌ను నిలిపివేసినట్లు అక్కడ స్పష్టంగా రాసి ఉంది.అసలు ఈ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారనే విషయానికి వస్తే.. ఎక్స్ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం నుంచి సరైన చట్టపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినా లేదా చట్టపరమైన ఆదేశాలు వచ్చినా.. ఆయా దేశాల పరిధి వరకు మాత్రమే సదరు కంటెంట్ లేదా అకౌంట్ కనిపించకుండా యాక్సెస్‌ను నిలిపివేస్తామని ఎక్స్ సంస్థ వివరించింది. చట్టపరమైన డిమాండ్ల వల్లే ఈ వ్యంగ్య పొలిటికల్ అకౌంట్‌పై ఇండియాలో ఈ విధమైన పరిమితి విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

PRASANNA · ఒక నెల క్రితం
లీగల్ వార్తలు

లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ఎల్.కోట :విజయనగరం జిల్లా. ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారి ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ముఖ్య అతిధిగా హాజరై, విదార్ధిని, విధ్యార్ధులు, తల్లితండ్రులు, ప్రజలతో మమేకమయ్యారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం నిర్వాహకులు జిల్లా ఎస్పీ కి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ – విద్యార్థులు చిన్నప్పటినుంచే లక్ష్యాలను నిర్దేసించుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామానికి చెందిన బాలికలు కుమారి వై.ఉమా పార్వతి పదవ తరగతి ఫలితాలలో 594 మార్కులు, అదేవిధంగా కుమారి కొసురు పూర్ణిమ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో 464 మార్కులు సాధించి జిల్లాలో ప్రధమ స్థానాలలో నిలిచి తమ తల్లితండ్రులకు, గురువులకు, ఊరికి, పాఠశాలకు మరియు విజయనగరం జిల్లాకు మంచి పేరు తెచ్చారని, మిగతా విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ తెలిపారు. పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని జిల్లాలో ప్రధమ స్థానం సాధించటం నిజంగా ఒక గొప్ప విషయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విదార్ధులు ప్రైవేటు పాఠశాల విదార్దులతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారని, ఇది మంచి పరిణామమని జిల్లా ఎస్పీ తెలిపారు. విదార్ధులు చదువుతోపాటు సాంకేతికంగా వచ్చే మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా భోగాపురంలో విమానాశ్రయం వస్తుందని, మనకి దగ్గరలో గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుందని తెలిపారు. విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకొని, తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, మంచి విజయాలను సాధించి తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారు ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ కొనియాడారు.మహిళలు మరియు పిల్లల రక్షణ, భద్రతకు జిల్లా పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇందులో భాగంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపదుతున్నామని తెలిపారు. ఆపద సమయాల్లో తమ స్వీయ రక్షణకు ఆత్మరక్షణ మెళుకువలు విద్యార్ధినులకు నేర్పించడం, వారికి రక్షణగా ఉండే చట్టాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. చదువుకొనే సమయంలో విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా లక్ష్య సాధన వైపు నడవాలన్నారు. యువత గంజాయి జోలికి పోవద్దని, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, “అమ్మ జన్మనిస్తే – హెల్మెట్ పునర్జన్మని ఇస్తుందని” జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఏ అపాయం వచ్చినా డయల్ 100/112 ఫోన్ చేసి, పోలీసులు సహాయం పొందవచ్చునని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.అనంతరం జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన కుమారి వై.ఉమా పార్వతి మరియు కుమారి కొసురు పూర్ణిమలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు సన్మానించి, మేమోంటోలు అందచేసారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ రామకృష్ణ, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SATISH RAJ · ఒక నెల క్రితం · Andhra Pradesh, Vizianagaram
లీగల్ వార్తలు

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన విశాఖ నగర పోలీసులు.

విశాఖ క్రైమ్ :డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ll - టౌన్ మరియు దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా "కార్డన్ & సెర్చ్" ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, 45 మద్యం బాటిళ్లు మరియు సరియైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.

SATISH RAJ · ఒక నెల క్రితం
లీగల్ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి వైస్‌ చైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి ఉన్నారు.ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

RAJ · ఒక నెల క్రితం · Telangana, Hyderabad
ప్రకటన (Advertisement)
లీగల్ వార్తలు

ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్ లను అందజేసిన ; సీపీ డా.శంఖబ్రత బాగ్చి

విశాఖ క్రైమ్: సిబ్బంది సంక్షేమంతో పాటుగా వారు అందించిన సేవల యందు ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 203 మందికి రివార్డులను బుధవారం ఉదయం నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి అందజేశారు. క్రైమ్ రివ్యూ మీటింగ్ నందు గత నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ 203 మందికి రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం,అలాగే .నగర పోలీసు శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గా గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్ధవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి చర్యలు తీసుకున్న విషయం విధితమే. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, చోరీ కాబడిన సొత్తు,ఇతర వస్తువులను రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులో, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 203 మంది, హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేసి, సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా క్రైమ్ మీటింగ్ కు నందు నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డు మంజూరు ఆర్డరును ఇవ్వడం జరిగినది.

PRASAD · ఒక నెల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
లీగల్ వార్తలు

ఎస్‌సీటీపీసీ పోలీస్ శిక్షణార్థులకు అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ

విజయనగరం, మే 20: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కమాండెంట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 191 మంది SCTPC (Stipendiary Cadet Trainee Police Constable) శిక్షణార్థులకు నాలుగు రోజుల పాటు అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి తెలిపారు.పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో ప్రమాదాలు, గుండెపోటు, మునిగిపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అలాంటి సందర్భాలలో తక్షణ వైద్య సహాయం అందించగల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), అత్యవసర చికిత్స విధానాలు, గాయపడిన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించే పద్ధతులు, గుండెపోటు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, శ్వాస ఆడకపోతే చేయవలసిన సహాయక చర్యలపై శిక్షణ అందించబడిందన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో డమ్మీ మానికిన్స్ (Mannequins) సహాయంతో ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించబడిందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న పోలీస్ శిక్షణార్థులు అత్యంత ఆసక్తి కనబరిచారని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి పేర్కొన్నారు.

SATISH RAJ · ఒక నెల క్రితం · Andhra Pradesh, Vizianagaram
లీగల్ వార్తలు

ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.

----- యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు.ఉరవకొండ : అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు తన ప్రవర్తన మార్చుకోలేదని తెలుస్తోంది.దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం అతనికి గుండు కొట్టి.. చెప్పులు, చీపురుల్లు కట్టి గ్రామంలో ఊరేగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలపై వేధింపుల ఘటనలపై కఠిన చర్యలు అవసరమని ఒకవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తులను అవమానించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

SARATH BABU · ఒక నెల క్రితం · Andhra Pradesh, Chittoor
లీగల్ వార్తలు

దళితులు అంటే అంత చులకన ?

---ప్రభుత్వం టెండర్ నోటిసు చెల్లదంటున్న రాజకీయ ప్రముఖుడు.--ఉద్యోగులు పై రాజకీయ ఒత్తిడి...నిస్సహాయ స్థితిలో అధికారులు ---నేనే మంత్రి....? నేనే రాజు ఉంటున్న వైనం....!ఆలమూరు :  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా .ఆలమూరు మండల పెదపళ్ళ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యనిర్వహణ అధికారి శానిటేషన్ ప్లంబర్ ఎలక్ట్రికల్ టెండర్ పత్రిక ప్రకటనను ఎప్పటిలాగే విడుదల చేశారు. ఈ టెండరు కు పెదపళ్ళ అంబేద్కర్ కాలనీకి చెందిన గంటామధు s/o సూర్యరావు( మాల) శానిటేషన్ సిబ్బంది సప్లై కి టెండర్ కు వెళ్ళగా అధికారులు ప్రక్రియను పరిశీలించి టెండర్ ఖరారు చేసి షరతులతో కూడినటువంటి పత్రాలను టెండర్ దారుడు మధుకి అందజేశారు . అయితే ఓ రాజకీయ ప్రముఖుడు దళితులకు టెండర్ ఏంటి? అంటూ ప్రభుత్వ టెండర్ నోటిసు చెల్లదని ఒత్తిళ్లు తేవడంతో టెండర్ విషయాన్ని అధికారులు ఎటు తేల్చలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అంటే అధికారులకు పవర్ లేదా? ప్రభుత్వ టెండర్ నోటీసుకు విలువ లేదా? నెల రోజులుగా అధికారులు తలలు పట్టుకోవడంతో  టెండర్ దారుడు సామాన్య ప్రజలకు న్యాయం దొరకదా అంటూ గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందజేశారు.

GANTA MADHU · 2 నెలల క్రితం · Andhra Pradesh, Kakinada
లీగల్ వార్తలు

జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై తీర్పు

--- ఈ నెల 22 కీ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టుహైదరాబాద్ :  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ ప్రక్రియను తప్పుబడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్.కే. జోషి కోర్టును ఆశ్రయించారు. కమిషన్ తమ వాదనలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని, కాబట్టి ఈ నివేదికను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం మరియు పిటిషనర్ల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

NAVEEN · 3 నెలల క్రితం · Telangana, Hyderabad
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)