---ప్రభుత్వం టెండర్ నోటిసు చెల్లదంటున్న రాజకీయ ప్రముఖుడు.
--ఉద్యోగులు పై రాజకీయ ఒత్తిడి...నిస్సహాయ స్థితిలో అధికారులు
---నేనే మంత్రి....? నేనే రాజు ఉంటున్న వైనం....!
ఆలమూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా .ఆలమూరు మండల పెదపళ్ళ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యనిర్వహణ అధికారి శానిటేషన్ ప్లంబర్ ఎలక్ట్రికల్ టెండర్ పత్రిక ప్రకటనను ఎప్పటిలాగే విడుదల చేశారు. ఈ టెండరు కు పెదపళ్ళ అంబేద్కర్ కాలనీకి చెందిన గంటామధు s/o సూర్యరావు( మాల) శానిటేషన్ సిబ్బంది సప్లై కి టెండర్ కు వెళ్ళగా అధికారులు ప్రక్రియను పరిశీలించి టెండర్ ఖరారు చేసి షరతులతో కూడినటువంటి పత్రాలను టెండర్ దారుడు మధుకి అందజేశారు . అయితే ఓ రాజకీయ ప్రముఖుడు దళితులకు టెండర్ ఏంటి? అంటూ ప్రభుత్వ టెండర్ నోటిసు చెల్లదని ఒత్తిళ్లు తేవడంతో టెండర్ విషయాన్ని అధికారులు ఎటు తేల్చలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అంటే అధికారులకు పవర్ లేదా? ప్రభుత్వ టెండర్ నోటీసుకు విలువ లేదా? నెల రోజులుగా అధికారులు తలలు పట్టుకోవడంతో టెండర్ దారుడు సామాన్య ప్రజలకు న్యాయం దొరకదా అంటూ గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందజేశారు.
మొదటి వ్యాఖ్య రాయండి!