ఎచ్చర్ల ( న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతాయని ఆర్.ఐ ఓ కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 51 కేంద్రాలలో 23,527 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నార అని అన్నారు .వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 14181 మంది ద్వితీయ సంవత్సరం 9346 మంది పరీక్షలు హాజరు అవుతారని అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష లకు,హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
\రేపటినుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
వార్తలు
RAMA RAO
ఒక నెల క్రితం
AI సారాంశం
ఎచ్చర్ల ( న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు గురువ
మొదటి వ్యాఖ్య రాయండి!