అమరావతి : ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసి రూ.20వేలు ఇస్తోందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోందని... 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి జరుగుతోందని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్
వార్తలు
CHANDU
ఒక నెల క్రితం
AI సారాంశం
అమరావతి : ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది
మొదటి వ్యాఖ్య రాయండి!