మద్దిలపాలెం :
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం వాల్తేరు డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ అధ్యక్షులు ఎ కె శివాజీ ముఖ్య అతిథిగా విచ్చేసారు.గేట్ మీటింగ్ ను ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కనుగోలు చేయాలని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్త్రీ శక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మగవారికి మాత్రమే టికెట్ ఇచ్చే విధానం ద్వారా మహిళలు ఉచితంగా ఎటువంటి టికెట్ తీసుకోకుండా ప్రయాణించేలా చేయాలని ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని కొత్త టిమ్ లు ఏర్పాటుచేయాలని పి ఆర్ సి కమిటీని నియమించి ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డి ఎ ఆరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇవ్వాలని గౌరవ ఎండి గారికి ఇచ్చిన మెమోరాండంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలని రిటైర్ అయిన చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్స్ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఇ ఎచ్ ఎస్ నుండి మినహాయించి గతంలో ఆర్టీసీ నందు ఉన్న వైద్య సదుపాయం అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్ర కమిటీ కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఉద్యోగులను ముందుగా వాల్తేరు డిపో అధ్యక్షులు ఆర్ వసంతరావు చైతన్యపరిచారు ఈ గేటు మీటింగ్ లో రాష్ట్ర కార్యదర్శి పిజిపతి కార్యదర్శి ఎస్ యం నాయుడు డి ఎస్ ఆర్ రాజు గ్యారేజీ అధ్యక్షకార్యదర్శులు గ్యారేజ్ ఉద్యోగులు. సి సి ఎస్ డెలిగేట్ కె టి రావు అత్యధిక సంఖ్యలో యూనియన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,
మొదటి వ్యాఖ్య రాయండి!