సీపీఐ జాతీయ నేత నారాయణ
హైదరాబాద్ :
అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్దం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంగా యుద్దం చేస్తుందన్నారు. దురాక్రమణ చేసేందుకే పలు కారణాలు చూపి యుద్దం ప్రారంభించిందని అమెరికాపై మండిపడ్డారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ దేశాల సమన్వయంతో ట్రంప్‌తో మాట్లాడి యుద్దం ఆపేలా ప్రయత్నం చేయాలని కోరారు.
భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలని సీపీఐ తరపున కోరుతున్నామని నారాయణ తెలిపారు. ధార్మిక సంస్థల్లో కఠినమైన పాలసీలు తీసుకురావటం ద్వారానే లడ్డూ కల్తీ లాంటి సమస్యలు ఆగుతాయని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని, శ్రీలక్ష్మి చేసిన చిన్న తప్పిదం వలన ఆమె కెరీర్ దెబ్బతిందన్నారు. బాద్యతాయుతంగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రలోభాలకు లొంగడంతోనే వ్యవస్తలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాకినాడ లో జరిగిన దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని నారాయణ పేర్కొన్నారు. కల్తీ పాలు తాగటం వలన ప్రజలు చనిపోతున్నారని, డెయిరీలపై ప్రభుత్వ నియంత్రణ ఏమైందని ప్రశ్నించారు. నక్సలైట్లను చంపవచ్చు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరన్నారు. పేదరిక నిర్మూలన జరిగితే నక్సలిజం అవసరమే రాదన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణగదొక్కాలని అవినీతి మరక అంటించారని ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆరు వేల కోట్లు ఉన్నాయని.. రెండు వేల కోట్లు విడుదల చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీఎం చంద్రబాబు మధ్యవర్తిత్వానికి అప్పగించాలని నారాయణ కోరారు.
డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణం
న్యూస్
KARTHIK
3 గంటల క్రితం
AI సారాంశం
సీపీఐ జాతీయ నేత నారాయణ హైదరాబాద్ : అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్
మొదటి వ్యాఖ్య రాయండి!