
బహుముఖ ప్రజ్ఞాశాలి కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ
విశాఖ సిటీ, న్యూస్ వన్ :
ఒకే వ్యక్తిలో ఒక సమర్థవంతమైన నాయకురాలిని, ఒక ఛాంపియన్ క్రీడాకారిణిని మరియు ఒక సామాజిక సంస్కర్తను చూడటం అరుదు. ఆ అరుదైన వ్యక్తిత్వమే పెద్దిశెట్టి ఉషశ్రీ విశాఖపట్నం 43వ వార్డు కార్పొరేటర్‌గా ప్రజా సేవలో నిమగ్నమై ఉంటూనే, బ్యాడ్మింటన్ కోర్టులో అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధిస్తూ ఆమె సృష్టించిన రికార్డులు అమోఘం. ఉషశ్రీ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా మన దేశ జెండాను గర్వంగా ఎగురవేశారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, తన ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్‌ను ఆమె విస్మరించలేదు. ఇటీవల ఫిబ్రవరి 2025లో విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఉషశ్రీ అద్భుత ప్రదర్శన చేశారు. 45+ ఏళ్ల విభాగంలో మహిళల సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మరియు మిక్స్‌డ్ డబుల్స్ ఇలా మూడు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించి ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా నిలిచారు. గతంలోనూ సియోల్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం ఊహించారు. ప్రస్తుతం కూడా రాష్ట్రస్థాయి లో మరొక్కసారి ఛాంపియన్ గా నిలిచి తన సత్తా చాటారు.క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే" అని నమ్మే ఉషశ్రీ ప్రతిరోజూ ఉదయం కోర్టులో ప్రాక్టీస్ పూర్తి చేసి, ఆపై వార్డు పర్యటనలకు వెళ్తుంటారు. ఆమె చూపిస్తున్న ఉత్సాహం యువతకు ఒక గైడ్ లాంటిది. సామాజిక కార్యకర్తగా కూడా ఆమె సేవలు అనన్యసామాన్యం. యంగ్ శర్మనార్ గ్లోబల్ యూనివర్సిటీ సభ్యురాలిగా విద్యా రంగంలో సంస్కరణలకు కృషి చేస్తూనే, మహిళలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని పలు వేదికల ద్వారా పిలుపునిస్తుంటారు. ఇంటిని, రాజకీయాలను, మరియు క్రీడలను సమన్వయం చేసుకుంటూ ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు ఆదర్శం అని చెప్పవచ్చు. కార్పొరేటర్‌గా ఆమె వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. 43వ వార్డులో పారిశుద్ధ్య మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ మరియు మహిళల భద్రత కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో వార్డు సమస్యలపై ఆమె చేసే వాదనలు ఆమెలోని ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్పవచ్చు.
మొదటి వ్యాఖ్య రాయండి!